Friday 14 October 2011

నిర్వహణ ఖర్చులు, నివాస ధ్రువీకరణపత్రం గురించి నోటీసు

 
నోటీసు
విషయం (నిర్వహణ ఖర్చులు, నివాస ధ్రువీకరణపత్రం గురించి)
18-06-2012
16-06-2012 వతేదీన సాయిక్లస్టర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆఫీసు ఆవరణలో ఉదయం 10-00గంటలకు  అత్యవసర సమావేశం జరిగింది. దీనిలో కింది సమస్యల్ని చర్చించడం జరిగింది.
1.నీటిసమస్య
వేసవికాలం కావడంలో హైదరాబాదు, సికింద్రాబాదు జంటనగరాల ప్రజలంతా నీటిసమస్యతో  అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి మన అపార్ట్మెంటువాళ్ళకి కూడా ఎదురవుతోంది. మంజీరా వాటర్‌ రెగ్యులర్‌గా రావడంలేదు. దీని గురించి మన అసోసియేషన్‌ సభ్యులు సంబంధిత అధికారులతో చర్చించడం జరిగింది. వారానికి రెండురోజులు మాత్రమే మంజీరా నీటిని సరఫరా చేస్తున్నారనీ, అదికూడా నిర్ణీత సమయాన్ని పాటించడం లేదనీ సంబంధిత అధికారులకు విన్నవించడం జరిగింది. అది అందరికీ ఉన్న సమస్యేనని, నీటిసరఫరా వేళల్ని కార్యాలయంలో తెలుసుకోవాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లని చేసుకోవాలని సూచించారు.
2.చెత్తసమస్య
చెత్తను అధికారికంగా తీసుకెళ్ళడానికి మునిసిపాలిటీ వాళ్ళేవిధమైన సౌకర్యాల్ని కల్పిండంలేదనీ, చెత్త తీసుకెళ్ళే వాళ్ళంతా ప్రయివేటు వ్యక్తులని మన అపార్ట్మెంటువాళ్ళు గమనించాల్సి ఉంది. కనుక, మనం వేసే చెత్తను తీసుకెళ్ళే వ్యక్తికి మన అపార్ట్మెంటువాళ్ళే డబ్బులు చెల్లించాలి.
అపార్ట్మెంటు నిలో వచ్చే చెత్త రెండు రకాలు. ఒకటి: కామన్‌ ఏరియాలో వచ్చే చెత్త. ఇది కామన్‌ మెయింటనెన్స్‌కి సంబంధించిన నిర్వహణలోకి వస్తుంది. రెండు: వ్యక్తిగతంగా మన ఇళ్ళలో వాడుకోవడం ద్వారా వచ్చే చెత్త. దీని నిర్వహణ ఖర్చుని ఆ యా ఫ్లాట్స్‌ వారే భరించాలి. అది యజమానులా? అందులో అద్దెకుండేవారా? అనేది వారి వారి ఒప్పందాల్ని బట్టి ఉంటుంది. ఒప్పందమేదైనా, ఆ ఇంటిలో ఉండేవాళ్ళు మెయింటనెన్స్‌తో కలిపి ప్రతినెలా ఇవ్వాలి. ఒకవేళ వ్యక్తిగత చెత్తకు సంబంధించి డబ్బులు ఇవ్వడానికి ఎవరికైనా ఇష్టం లేకపోతే, కారణమేమిటో లిఖితపూర్వకంగా ఈ నోటీసు అందుకున్న మూడురోజుల్లోగా సాయిక్లస్టర్ వెల్ఫేర్ అసోషియేషన్ సభ్యులకివ్వాలి. తర్వాత కమిటీ తీసుకొనే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి.
ఇంతకు ముందు చెత్తను ఆ యా ఫ్లాటుకి సంబంధించినవాళ్ళు వ్యక్తిగతంగా కిందికి పట్టుకొచ్చి కిందసడేసేవారు. దాన్ని క్రమపద్ధతిలో వేయకపోవడం, రెగ్యులర్‌గా చెత్తను తీసుకెళ్ళకపోవడంతో దోమలు పెరిగిపోవడం, మురికి వాసనరావడం, చెల్లాచెదురైపోవడం వంటిసమస్యలు తలెత్తాయి. అందువల్ల రెండు పెద్దడబ్బాలను కొనడం జరిగింది. వాటిలోనే చెత్తను వేయడం వల్ల పై సమస్యలు కొన్ని తీరాయి. అయినా, చెత్తని రోజూ తీసుకెళ్ళకపోవడంతో కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. కాబట్టి, అవసరమైతే చెత్త తీసుకెళ్ళే వ్యక్తిని మార్చేయాలని సమావేశం తీర్మానించింది. 
అలాగే, మన అపార్ట్మెంటు భద్రతా చర్యల దృష్ట్యా కామన్‌ మెయింటనెన్స్‌లోనే చెత్త డబ్బుల్ని (వ్యక్తిగత చెత్తకి సంబంధించినవి) కూడా  జతచేసి వసూలు చేయడం, వాటిని చెత్తతీసుకెళ్ళే వ్యక్తికి ఇవ్వడం జరుగుతోంది. ఇంతకు ముందు ఫ్లాట్‌ వ్యక్తిగత చెత్తకు సంబంధించి, ఆ యా ఫ్లాట్‌ యజమానులు లేదా అద్దెకుండేవారే చెత్త తీసుకెళ్ళేవ్యక్తికి ప్రత్యక్షంగా చెల్లించేవారు. అందువల్ల చెత్తతీసుకెళ్ళే వ్యక్తి తనకిష్టం వచ్చినప్పుడల్లా ప్రతి ఫ్లాట్‌ కి వచ్చి, వెళ్ళే వీళ్ళేకుండా నిరోదించగలిగాం. దీనివల్ల చాలా సమస్యలు తీరాయి. కానీ, ఆ యా ఫ్లాట్‌ యజమానులు లేదా అద్దెకుండేవాళ్ళు, వారి వ్యక్తిగత చెత్తకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడానికి కొంతమంది సహకరించడంలేదు. ఇటువంటి ఇబ్బందులు కలిగించే ఒకరిద్దరి వల్ల మొత్తం అపార్ట్మెంటుప్రజలంతా అనేకసమస్యల్ని ఎదుర్కోవలసి వస్తుందని గుర్తించాలి. అందువల్ల వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని సమావేశం తీర్మానించింది.
3. మురుగునీటి సమస్య:
మన అపార్ట్మెంటులో బాత్‌రూమ్‌, కిచెన్‌, తదితర ప్రదేశాల్లో వాడుకొనేటప్పుడు, నీటితో పాటు రకరకాలైన వస్తువుల్ని, చెత్తనూ పడేస్తున్నారు. దీనితో మురుగునీరు డ్రైనేజీలోకి వెళ్ళడం లేదు. చాలా ఫ్లాట్స్ లో నీళ్ళు డ్రైనేజీలోకి వెళ్ళకుండా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాగే డ్రైనేజీ చెత్తతో నిండిపోవడంతో దాన్ని క్లీన్‌ చేయించడం వ్యయ ప్రయాసల్ని కలిగిస్తుంది. ఇప్పటికే మన డ్రైనేజీ క్లీన్‌ చేయించడం, మెయిన్‌ డ్రైనేజీతో కలపడానికి పనులు చేయించడం జరిగింది. ఇవన్నీ అత్యధిక ఖర్చులతో కూడిన పనులని గమనించాలి. అందువల్ల బాత్‌రూమ్‌, కిచెన్‌లో నీటిని ఉపయోగించేటప్పుడు నీటితో పాటు చెత్తను వేయవద్దని సమావేశం విజ్ఞప్తి చేస్తుంది.
4.వాచ్‌మెన్‌, సెక్యూరిటీ నిర్వహణ:
    సాధారణంగా అపార్ట్మెంటు నిర్వహణకు సంబంధించి ముందుగానే ప్రతి ఫ్లాట్‌ యజమానీ అపార్ట్మెంటు కొనుక్కొనేటప్పుడు కొంత సొమ్ముని కార్పస్‌ఫండ్‌గా జమచేస్తారు. వాటి నుండే అపార్ట్మెంటుకామన్‌ మెయింటనెన్స్‌ ని ఉపయోగించడం జరుగుతుంది. కామన్‌ ఏరియాలో ఎలక్ట్రిసిటీ, వాటర్‌ బిల్లులు, అపార్ట్మెంటుక్లీనింగ్‌ సామానులు కొనడం, వాటి రిపేర్స్‌, వాచ్ మెన్ జీతం వంటివన్నీ సాధారణంగా ఈ బడ్జెటు నుండే తీసుకొని ఖర్చుచేయాల్సి ఉంటుంది.
మన బిల్డర్‌మన అపార్ట్మెంటు నికి సంబంధించి ఎటువంటి కార్పస్‌ఫండ్‌నీ మన సాయిక్లస్టర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వారికి ఇవ్వలేదు. అందువల్ల కార్పస్‌ఫండ్‌ని వసూలు చేయాలని, దాన్ని బ్యాంకులో వేసి, ఆ వడ్డీతో లేదా అవసరమైనంతమేరకు తీసుకొని కామన్‌మెయింటనెన్స్ నుండి వసూలు  చేయాలని గతంలోనే తీర్మానించడం జరిగింది. ఇంకా కొద్దిమంది ఈ సొమ్ముని ఇవ్వలేదు. అందువల్ల కేవలం వాచ్‌మెన్‌ని మాత్రమే పెట్టుకొని, అత్యవసరమైన పనులను చేయడం జరుగుతోంది. దీని గురించి సీరియస్‌గా ఆలోచించి తగిన చర్యలు తీసుకోవాలని సమావేశం తీర్మానించింది.
5.అద్దెవ్యక్తులతో సమస్యలు:
   మన అపార్ట్మెంటువివిధ ఫ్లాట్స్‌లోకి అద్దెకు వచ్చినవాళ్ళతో సొంతఫ్లాట్స్‌ వాళ్ళు అనేకసమస్యల్ని ఎదుర్కొవలసి వస్తుంది. బహుశా అద్దెకొచ్చినవాళ్ళలో ఈఫ్లాట్స్‌ మనకి శాశ్వతం కాదనీ, అపార్ట్మెంటుఅసోసియేషన్‌ వారికి జవాబుదారీగా లేకపోయే స్వభావమే వాళ్ళీ సమస్యల్ని సృష్టించడానికి కారణం కావచ్చునని సమావేశం అభిప్రాయపడింది. అందువల్ల ఫ్లాట్స్‌ యజమానులు అసోసియేషన్‌ వారికి అద్దెకొచ్చేవారి గురించి వివరించాలని సమావేశం తీర్మానించింది. 
తీర్మానాలు
ఇందుమూలంగా యావన్మంది సాయిక్లస్టర్‌ అపార్ట్మెంటు యజమానులకు, అద్దెకుండే వారికీ తెలియజేయునదేమనగా,  మన అపార్ట్మెంటుని  క్రమబద్ధమైన పద్ధతిలో నిర్వహించుకోవడానికి వీలుగా  16-06-2012 వతేదీన జరిగిన అత్యవసరసమావేశంలో కింది చర్యలు తీసుకోవాలని సాయిక్లస్టర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ తీర్మానించింది.
1.  నిర్ధేశిత అపార్ట్మెంటు నిర్వహణ ఖర్చులను ప్రతినెల 5వతేదీలోగా చెల్లించాలి.
2.  అపార్ట్మెంటుఉమ్మడి నిర్వహణ ఖర్చుల (అపార్ట్మెంటుజనరల్‌ మెయింటనెన్స్‌ చార్జెస్‌) వివరాలను ప్రతినెల 15వతేదీ తర్వాత నోటీసుబోర్డులో చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఏవైనా అభ్యంతరాలు ఉంటే సాయిక్లస్టర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వారికి లిఖితపూర్వకంగా తెలియజేయవచ్చు. వాటిపై తగిన చర్యలను నెలవారీ జరిగే తదుపరి సమావేశంలో తెలుసుకోవచ్చు.  
3. ఒకవేళ ఏకారణం వల్లనైనా నోటీసుబోర్డులో పై వివరాలు లేకపోతే, వాటిని మన అపార్ట్మెంటుకి సంబంధించిన ఇంటర్నెట్‌బ్లాగు http://www.saiclusterapartment611.blogspot.com లో తెలుసుకోవచ్చు.
4. నిర్ధేశించిన మెయింటనెన్స్‌ చార్జెస్‌ పైన తెలిపిన తేదీలోగా ఇవ్వకపోయినా, తక్కువ ఇచ్చినా, ఆ ఫ్లాటుకి సంబంధించిన ఎలక్ట్రిసిటీ కనెక్షన్‌ తొలగించడం, నీటిసరఫరాను నిలిపివేయడం, ఆ అపార్ట్మెంటు నుండి చెత్తను (డస్ట్‌) ని ఉమ్మడి చెత్తతొట్టిలో వేయకుండా నిరోదించడం మొదలైన చర్యలను తీసుకోవాలని సమావేశం తీర్మానించింది.
5. అపార్ట్మెంటుయజమానులు, అద్డెకుండేవారూ తమ అపార్ట్మెంటులో ఉండేవారి వివరాలను  సాయిక్లస్టర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రూపొందించిన నమూనా పత్రం (నివాస వివరాల ధ్రువీకరణ పత్రం, (DECLARATION OF RESIDENCY DETAILS)లో పేర్కొని, ఆఫీసులో ఇవ్వాలని సమావేశం మరోసారి విజ్ఞప్తి చేస్తుంది. ఈ వివరాలను సొంత అపార్ట్మెంటుయజమానులు ఈనెల 30వతేదీలోగా ఇవ్వాలి. అలాగే అద్దెకుండేవారు అపార్ట్మెంటులోకి వచ్చిన 15 రోజులలోగా ఈ వివరాలను సాయిక్లస్టర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వారికి అందించాలని అపార్ట్మెంటుయజమాలే తెలియజేయాల్సి ఉంటుంది.
6.  నివాస వివరాల ధ్రువీకరణ పత్రం లేకపోవడం వల్ల అనేక భద్రతాపరమైన, రక్షణపరమైన, నిర్వహణాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని సమావేశం అభిప్రాయపడిరది. పై వివరాలను ఇవ్వనియెడల వారికేమి జరిగినా సాయిక్లస్టర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వారిని అనధికారసభ్యులుగా భావిస్తూ, తగిన చర్యలను తీసుకోవాలని తీర్మానించింది.
7. అసోసియేషన్‌ నియమనిబంధనలను పాటించాలని అద్దెకుండేవాళ్ళు ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని సమావేశం తీర్మానించింది.
8.  కార్పస్‌ ఫండ్‌ వసూలు విషయంలో జనరల్‌ బాడీ మీటింగ్‌ పెట్టి అన్నివిషయాలు చర్చించి, ఆ సమావేశంలో దానిపై తగిన నియమనిబంధనల్ని రూపొందించాలని సమావేశం తీర్మానించింది.
9. బాత్‌రూమ్‌, కిచెన్‌లో నీటిని ఉపయోగించేటప్పుడు నీటితో పాటు చెత్తను వేయవద్దని సమావేశం తీర్మానించింది.
10.  సాయిక్లస్టర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌  నివాసస్థుల వాహనాలకు గుర్తింపుకార్డులు (స్టిక్కర్ల) ఏర్పాటు చేయాలని తీర్మానించడమైనది. వాటిని సంబంధిత యజమానులు తీసుకొని తమ వాహనాలకు అతికించుకోవాలని సమావేశం తీర్మానించింది.
11. సాయిక్లస్టర్‌ అపార్ట్మెంటు మార్గాన్నిసూచించే బోర్డు  (way board) ని మెయిన్ రోడ్డు దగ్గర  ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానించింది.
12. కామన్‌ ఏరియాని వాచ్‌మెన్‌ శుభ్రం చేసేటప్పుడు అందుబాటులో ఉన్న వ్యక్తులతో అసోసియేషన్‌ వారి నిర్దేశిత పుస్తకంలో సంతకం తీసుకోవాలని తీసుకోవాలని తీర్మానించడమైనది.
13.  వివిధ ఫ్లాట్స్ లో  తమ కిటికీలపై  కుండీలు పెట్టుకొనేటప్పుడు కింది ఫ్లాట్స్ వారికి ఇబ్బంది కలగకుండా వ్యవహరించాలని తీర్మానించడమైనది. గ్రిల్స్ పై కుండీలు పెట్టుకొనేటప్పుడు, దానికింద ఏదైనా ప్లాస్టిక్ కవరు వేసుకోవడం ద్వారా కింది ఫ్లాట్స్ వారికి నీళ్లు కారకుండా ఉంటాయి. దీనికి తగినట్లు ఆ యా ఫ్లాట్స్ వారు చర్యలు తీసుకోవాలని సూచించడమైనది.
14. తమ వాహనాలను తమకు నిర్దేశించిన స్థలాల్లోనే పెట్టుకోవాలని, లేనిచో తగిన చర్యలు తీసుకోవాలని సమావేశం తీర్మానించింది.
15. తమ ఫిర్యాదులను వాచ్‌మెన్‌ దగ్గర అందుబాటులో ఉండే పుస్తకంలో లిఖితపూర్వకంగా రాయాలని సమావేశం తీర్మానించింది.
16.  సమావేశానికి రానివాళ్ళు, ఆ యా సమావేశాల్లో తీసుకొనే నిర్ణయాలను కట్టుబడి ఉండాలని సమావేశం తీర్మానించింది.


డాదార్ల వెంకటేశ్వరరావు          శ్రీ కె.వి.ఎన్‌.పి.శర్మ          శ్రీ ఏ. సంగమేశ్వర్‌
( ప్రసిడెంట్‌)                (వైస్‌`ప్రసిడెంట్‌)             ( జనరల్‌ సెక్రటరీ).

No comments:

Post a Comment